Eto Vellipoyindhi Manasu : సీతాకాంత్ కి విడాకుల గురించి నిజం తెలుస్తుందా.. సవతి తల్లి మరో ప్లాన్!
on Dec 5, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -270 లో.. శ్రీలతకి నందిని ఫోన్ చేసి.. మీరు ఇలా ఏం ప్లాన్ చెయ్యకుండా ఉంటే ఎలా? నా సీతా నాకు దూరం అవుతున్నాడనిపిస్తుంది.. రామలక్ష్మి వాలకం చూస్తుంటే ఏదో ప్లాన్ లో ఉన్నట్టు ఉంది అందుకే నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రామలక్ష్మి ని లేకుండా చేస్తానని నందిని అంటుంది. శ్రీవల్లి ఫోన్ లాక్కొని నీకంటే ఆస్తులున్నాయ్. మాకు బావ గారి ఆస్తులు తప్ప ఏం లేవు. ఇప్పుడు ఆస్తులన్నీ రామలక్ష్మి పేరు మీదే ఉన్నాయ్ తనని చంపేస్తే ఆస్తులన్నీ ఎలా అని శ్రీవల్లి అంటుంది.
శ్రీలత ఫోన్ తీసుకొని.. శ్రీవల్లి చెప్పింది కరెక్టే.. రామలక్ష్మిపై సీతాకాంత్ కి విరక్తి పుట్టి సీతా నే విడాకులు ఇచ్చేలా చేస్తానని శ్రీలత అంటుంది. దానికి నందిని సరే అంటుంది. మరొక వైపు రామలక్ష్మి మాణిక్యంలు విడాకుల నోటిస్ పంపిన లాయర్ దగ్గరికి వచ్చి మీరు నాకు ఇష్టం లేకుండా ఎందుకు పంపారని రామలక్ష్మి అడుగుతుంది. మీ అత్తయ్య గారు మీకు విడాకులు ఇష్టమే.. మీరు రాలేని పరిస్థితిలో ఉన్నారంటే ఇలా చేసానని లాయర్ అనగానే.. ఇప్పటికి అయినా అర్ధం అయింది కదా నాకు న్యాయం చెయ్యండి అని రామలక్ష్మి అంటుంది. ఇప్పుడే మీ అత్త గారిపై కేసు పెడుతానంటాడు వద్దు మళ్ళీ మా ఆయన నన్ను అపార్ధం చేసుకుంటాడు. నేను పంపలేదు అని మా అయనతో చెప్పండి చాలని రామలక్ష్మి అనగానే.. లాయర్ సరే అంటాడు.
మరొకవైపు రాత్రి అయినా సందీప్ వాళ్లు వర్క్ చేస్తుంటే.. సీతాకాంత్ వచ్చి పడుకోండి అంటాడు. రేపు పని త్వరగా అయిపోతుంది అంటాడు. మీకు ఇలా పని చేస్తుంటే ఏం అనిపించడం లేదా అని సీతాకాంత్ అనగానే.. ఆస్తులు లేవనీ నిన్ను వదిలేసి వెళ్ళలేము అన్నయ్య అని సందీప్ అంటాడు. ఆ తర్వాత సీతాకాంత్ గదిలోకి వెళ్లి.. చూసావా వాళ్ళను ఎలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నావో అని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత సందీప్, శ్రీవల్లి లు బిర్యానీ తింటుంటే రామలక్ష్మి వచ్చి చూస్తుంది. వీళ్లేమో ఇలా ఉన్నారు సీతా సార్ వీళ్ళని నమ్ముతున్నాడనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం మాణిక్యాన్ని కలుస్తుంది రామలక్ష్మి. ఇక శంకర్ లాయర్ అల్లుడు ముందు నిజం చెప్తే శ్రీలత అట కట్టియోచ్చని మాణిక్యం అనగానే.. వద్దు నాన్న సీతా సర్ వాళ్ళ అమ్మ గురించి నిజం తెలిస్తే తట్టుకోలేడని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
